Thursday, November 21, 2024

నేటికి లాక్‌డౌన్‌ కష్టాలు


కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఎదురైన కష్టాలు దేశ ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ దూరదృష్టి లోపం, అసమర్ధత వల్ల లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. కరోనా కారణంగా శిశువులు, గర్భిణుల మరణాలు ఆసియాలోని ఆరు ప్రఖ్యాత దేశాల్లో కంటే భారత్‌లోనే ఎక్కువ నమోదు కానున్నాయని యునిసెఫ్‌ వెల్లడించిన నివేదికపైనా రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement