Monday, November 18, 2024

స్టార్ అవుతాడనుకున్న క్రికెటర్ రిటైర్ అయ్యాడు..

2012లో భారత జట్టు అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పాడు. 28 ఏళ్లకే క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇకపై ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్ లలో పాల్గొంటానని వెల్లడించాడు. భారత్ లో ఆటకు రిటైర్మెంటు ప్రకటించడం వల్ల తాను మాజీ ఆటగాడ్ని అవుతానని, తద్వారా విదేశీ లీగ్ పోటీల్లో ఆడేందుకు అడ్డంకులు ఉండబోవని వివరించాడు. ఇంతజేసీ ఉన్ముక్త్ చంద్ వయసు 28 ఏళ్లే. ఈ వయసుకు చాలామంది క్రికెటర్లు జాతీయ జట్లలో అరంగేట్రం చేస్తుంటారు. అలాంటిది, ఉన్ముక్త చంద్ తనకు మరిన్ని అవకాశాలు రావాలంటే రిటైర్మెంట్ ప్రకటించడం తప్పనిసరి అంటున్నాడు.

ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో 2012లో భారత జట్టు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది. ఆ టీమ్ సారథి ఉన్ముక్త్ చంద్ 19 ఏళ్లకే సెలబ్రిటీ అయిపోయాడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ అవుతాడని, భారత సీనియర్ జట్టును నడిపిస్తాడని నాడు క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు. కానీ, అవేవీ జరగలేదు. ఉన్ముక్త్ చంద్ ప్రతిభ దేశవాళీ క్రికెట్ వరకే పరిమితమైంది. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత ప్రాబబుల్స్ జాబితాలో స్థానం లభించినా, తుదిజట్లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఓ దశలో ఇండియా-ఏ సారథ్యం కూడా దక్కినా, అది కూడా కొద్దికాలమే. ఓవరాల్ గా తన కెరీర్ లో ఎక్కువభాగం ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ లో కొనసాగాడు. ఐపీఎల్ లోనూ కొద్దిమేర మాత్రమే కనిపించాడు.

https://youtube.com/watch?v=cP6xTCxdSOo

ఇది కూడా చదవండి: తాజా అధ్యయనం: పిల్లల్లో జలుబులా కరోనా..

Advertisement

తాజా వార్తలు

Advertisement