Friday, November 22, 2024

తేలుకు తిక్కుంది.. దానికో లెక్కుంది.. ఏమ‌న‌నంత వ‌ర‌కే సేఫ్‌.. కుట్టిందో అంతే సంగ‌తి..

తేలుని చూడ‌గానే దాదాపు అందరూ వామ్మో తేలు అని ఆమ‌డ దూరం ప‌రుగెడ‌తారు.. కానీ, వాటికి ఇబ్బంది క‌లిగించ‌నంత వ‌ర‌కు అవి ఎవ‌రికీ హాని త‌లపెట్ట‌వని చెబుతున్నారు పరిశోధకులు. వాటికి ఎదైనా ప్ర‌మాదం ఉందని గ్ర‌హిస్తే మాత్రం మ‌న‌ల్ని కుట్టకుండా వదిలే ప్రసక్తే లేదంటున్నారు. విష పూరిత‌మైన త‌న తొక‌తో కుట్టి ప్రాణాలు తీయ‌గ‌లిగే శ‌క్తి తేళ్లకు ఉంటుంది. అయితే.. తేళ్లు ఎంతో ప్ర‌త్యెక‌మైన జాతికి చెందినవి అంటున్నారు జంతు శాస్త్రవేత్త‌లు. అవి పురుగుల జాతికి చెందిన‌వి కావ‌ని, ఆర్థ్రోపొడా జాతికి చెందిన‌విగా చెబుతున్నారు. అయితే.. వీటికి ఎముక‌లు ఉండ‌వు. చిటిన్‌తో తయారు చేయబడిన ఎక్సోస్కెలిటన్‌ను కలిగి ఉంటాయి. ప‌ల్లు కూడా ఉండ‌వు. అందుక‌ని తోక‌తో దాడి, ప్ర‌తి దాడి చేస్తూ త‌మ‌ మ‌నుగ‌డ‌ను సాగిస్తాయి. వీటి పంజా ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ అంత‌గా దీన్ని విన‌యోగించ‌వు. వీటి తోకను మాత్రమే రక్షణ కోసం ప్ర‌యోగిస్తాయంటున్నారు ప‌రిశోధ‌కులు.

ఎవ‌రికైనా దెబ్బ త‌గలితే నొప్పి, బాధ‌ తెలుస్తుంది. కానీ, తేళ్లు నొప్పిని గ్ర‌హించ లేవని చెబుతున్నారు శాస్త్రవేత్త‌లు. అవి బాధ‌ని కూడా అనుభ‌వించ లేవు. కానీ, ఇరిటేష‌న్ ఫీల్ అవుతాయ‌ని చెబుతున్నారు. వాటికి దెబ్బ త‌గిలినట్టు గ్ర‌హించ‌గ‌ల‌వు. అయినా.. నొప్పి తెలియ‌దు కాబట్టీ బాధ‌ని ఎక్స్‌ప్రెస్ చేయ‌లేవు. తేళ్లు త‌మ‌ శ్వాస‌ను వారం రోజుల వ‌ర‌కు ఆపుకుని ఉంటాయ‌ట‌, ఆహారం లేకుండా ఎకంగా ఏడాది పాటు జీవించగ‌లిగే కెపాసిటీ వాటికి ఉంటుంద‌ని చెబుతున్నారు. చ‌దును గుంతలు ఎత్తు రాళ్లు దాదాపు ఇట్లా ప్ర‌తి సర్ఫేస్ పై ఎక్కగ‌లిగే సామ‌ర్ద్యం తేళ్ల‌కు ఉంటుంది. ప్ర‌త్యేకమైన కిర‌ణాల (UV) కింద వీటిని ఉంచితే మెరుస్తాయి. ప్ర‌పంచంలోని ఏడు ఖండాలలో రెండు వేల కంటే ఎక్కువ విభిన్న జాతులు ఉన్నట్టు చెబుతున్నారు జంతు శాస్త్రవేత్త‌లు..

తేలు కుట్టినచో నొప్పి తగ్గడానికి అల్లోప‌తిలోనే మందులు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్స ద్వారా కూడా మంట, నొప్పి తగ్గడానికి ఉత్తరేణి ఆకుల్ని దంచి రసం తీసి పాటు కుట్టినచోట రుద్దితే ఉప‌శ‌మ‌నం ఉంటుంది. హోమియో చికిత్స ద్వారా మాత్రమే నొప్పి మంట తగ్గుతుంది. ఎర్ర ఉల్లిగడ్డను రెండు ముక్కలుగా కోసి కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గతుంద‌ని గ్రామీణుల్లో న‌మ్మ‌కం ఉంది. అంతేకాకుండా తేలుపై ఒక చుక్క సారాయి వేస్తే అది త‌న‌కు తాను కుట్టుకొని చనిపోతుందని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement