Friday, November 22, 2024

“యూనివ‌ర్సల్ బాస్” బ్యాక్ ఇంటూ ఐపీఎల్..

యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అతను క్రూరమైన ఆట‌గాడు 42 సంవత్సరాల వయస్సులో కూడా త‌న ప‌వ‌ర్ అయిపోలేదు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో ఐపీఎల్ లో తన కెరీర్‌ను ప్రారంభించాడు, ఆ తర్వాత అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి మారాడు. RCB నుండి, అతను పంజాబ్ కింగ్స్ (PBKS)కి మారాడు. పంజాబ్ జట్టు కోసం నాలుగు సీజన్లు ఆడాడు క్రిస్.. కొన్ని సంవత్సరాలు ప్రేక్షకులను అలరించిన క్రిస్ గేల్.. 2022 IPLలో పాల్గొనడం లేదు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో గేల్ పాల్గొనలేదు. క్రిస్ గేల్ ఎక్కువగా టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా తన పరాక్రమానికి ప్రసిద్ది చెందాడు. పంజాబ్ కింగ్స్‌లో.. మిడిల్ ఆర్డర్‌లో కూడా గేల్ బ్యాటింగ్ చేశాడు.. ఒక్కసారి అత‌ను ఫామ్ లోకి వ‌స్తే అతడిని ఆపడం బౌలర్లకు కష్టమయ్యేది. ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. 2011, 2012, 2013, 2015 సంవత్సరాల్లో ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్లు కొట్టాడు. తన ప్రసిద్ధ స్వదేశంలో 141 ఇన్నింగ్స్‌లలో 357 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో 251 సిక్సర్లు బాదిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే.. సోమవారం అతను జిమ్‌లో ట్రైనింగ్ చేస్తున్న ఫోటోస్ వీడియోస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు.. “Work just start!! Lets go, In prep for IPL next year!” అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు గేల్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement