13 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ సినిమా హాలులో ఆయన తన కుటుంబ సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సినిమాను వీక్షించారు. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు అమిత్ షా హాజరయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్. ఈ సినిమాతో 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ చిత్ర సీమలో అడుగుపెడుతోన్న విషయం తెలిసిందే.. ఈ చితాన్నియాష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీని పాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు.సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం జూన్ 3న థియేటర్లలో విడుదల కానున్నది. స్క్రీనింగ్ అనంతరం ఈ పీరియాడికల్ డ్రామాలోని నటీనటులు, సిబ్బందిని ప్రశంసించారు. భారతదేశ సాంస్కృతిక యుద్ధాలను వివరించే ఈ చిత్రాన్ని చరిత్ర విద్యార్థిగా చూసి ఆనందించానని చెప్పారు.మహిళలను గౌరవించడం, వారికి సాధికారత కల్పించడం భారతీయ సంస్కృతి అని, ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అమిత్ షా అన్నారు. మధ్యయుగ యుగాలలో స్త్రీలు అనుభవించిన రాజకీయ అధికారం, స్వేచ్ఛ గురించి ఈ చిత్రంలో చూపించారని తెలిపారు.
థియేటర్ లో సినిమా చూసిన కేంద్రమంత్రి – 13ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో మూవీ చూసిన అమిత్ షా
Advertisement
తాజా వార్తలు
Advertisement