Tuesday, November 19, 2024

ధాన్యం సేకరణలో తెలుగు రాష్ట్రాల్లో అవకతవకలు.. స్పష్టం చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణలో అవకతవకలు, ఆలస్య రైతు చెల్లింపులపై విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఆయన ప్రశ్నలకు శుక్రవారం కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వరి సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం అక్రమాలపై విచారణ చేపట్టాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే కోరామని పీయూష్ గోయల్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని, వారి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. అలాగే వరి సేకరించిన మూడు నెలలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడా విచారణ జరపాలని కోరారు. వరిని సేకరించిన వెంటనే రైతులకు డబ్బు చెల్లించాలన్న ఉద్దేశంతో రాష్ట్రాలకు 90 శాతం ధాన్య సేకరణ సొమ్ము ముందస్తు రూపంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదేశాల మేరకు చెల్లిస్తునామని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement