Tuesday, November 26, 2024

AP | కనకదుర్గమ్మ సేవలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కనకదుర్గమ్మ వారిని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానముకు బుధవారం విచ్చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఆలయ కార్య నిర్వహణ అధికారి కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.

అమ్మవారికి బండి సంజయ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం బండి సంజయ్‌కు వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయ‌గా… ఆల‌య‌ ఈవో అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement