Saturday, November 23, 2024

బండి యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌..

యాదగిరి గుట్ట వంగపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు జై తెలంగాణ, భారత్‌ మాతాకీ జై, జై బీజేపీ అంటూ నినాదించారు. పాదయాత్రలో పాటలు పాడుతూ ముందుకు సాగారు. తొలిరోజు యాదగిరి గుట్ట నుంచి ప్రారంభమై గంగసానిపల్లి, ముత్తిరెడ్డి గూడెం, బస్వాపూర్‌ వరకు యాత్ర సాగింది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో మొదటిరోజు 14 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. బస్వాపూర్‌ సమీపంలో మంగళవారం రాత్రి బండి సంజయ్‌ బస చేశారు.

బుధవార హుస్సెన్‌ బాద్‌ రూరల్‌, భువనగిరి టౌన్‌, టీచర్స్‌ కాలనీలు, గొల్లగూడెం, మగ్దూంపల్లి, పెద్దపలుగుతండా మీదుగా 11.7 కిలోమీటర్ల యాత్రను ఆయన చేయనున్నారు. మొత్తం 24 రోజుల పాటు 328 కిలోమీటర్ల మేర మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర సాగనుంది. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా యాత్ర కొనసాగుతోంది. ఈనెల 26న హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభతో మూడో విడత యాత్ర ముగుస్తుంది. ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర జాతీయ నేతలను ముఖ్య అతిథులుగా తీసుకువచ్చే ఏర్పాట్లలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గం నిమగ్నమైవుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement