Saturday, September 14, 2024

TG | మెగాస్టార్‌ని క‌లిసిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్

కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన బండి సంజయ్.. చిరంజీవితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దీనిపై బండి సంజయ్ కూడా చిరంజీవిని కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దాంతో పాటు “నా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. చిరంజీవి వినయపూర్వకమైన వ్యక్తి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని” అని ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement