Thursday, October 3, 2024

Cabinet Meeting | రైల్వే ఉద్యోగుల‌కు బోన‌స్…

ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా తీసుకున్న కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్ సీడ్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూనె గింజల ఉత్పత్తికి వచ్చే ఆరేళ్లలో 10,103 కోట్లు వెచ్చించనున్నారు. వంటనూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది.

అలాగే దేశంలోని మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా లభిస్తుంది. ఇప్పటికే తెలుగుతో సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉన్న సంగతి తెలిసిందే. పీఎల్‌ఆర్‌పై రూ.198 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం లభించింది.

దాంతో పాటు దేశంలోని 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే ఉద్యోగులకు 28 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్ రూ.2028.57 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది.

- Advertisement -

ఇక, చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ఆమోద కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.63,246 కోట్ల రూపాయలతో చెన్నె పేజ్ 2 మెట్రో పనులు ప్రారంభించనున్నారు. 119 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. మూడు కారిడార్లలో 120 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement