కేంద్ర కేబినెట్ నేడు (శనివారం) మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విజ్ఞాన్ ధార, బయో ఈ-3 విధానం, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘విజ్ఞాన్‌ధార’ పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.
25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం 1 ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఇక ఇంటర్మీడియట్ (11వ తరగతి, 12వ తరగతి) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను క్యాబినెట్ ఆమోదించింది.
బయో ఈ-3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్) విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎకానమీ, పర్యావరణం, ఉపాధి ఆధారంగా బయో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు.