Saturday, January 25, 2025

Delhi | కేంద్ర బడ్జెట్‌ తయారీ.. ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక !

కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రోజు సాంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించింది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించగా… బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు, సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా, ఈ అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు మంత్రిత్వ శాఖ కార్యాలయ ఆవరణకే పరిమితం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement