రఘునాథపల్లి (ప్రభన్యూస్): గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పాఠశాలలోనే పిల్లల బుక్స్, స్కూల్ ఫర్నిచర్ దగ్ధమైన సంఘటన సోమవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో చోటు చేసుకుంది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కోడూరు ప్రాథమికోన్నత పాఠశాల రోజువారి లాగానే నాలుగు గంటలకు స్కూల్ ముగిసింది. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఇంటికి వెళ్ళిపోయారు. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించి వెళ్లిపోయారు. సాయంత్రం సమయం కావడంతో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు తిరిగి వస్తున్న గ్రామస్తులు పాఠశాలలో ఎగిసిపడుతున్న మంటలను గమనించి స్థానిక సర్పంచ్ కు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ కర్ణాకర్ కొంతమంది గ్రామస్థులను కలుపుకొని సంఘటన స్థలానికి మంటలను ఆర్పారు. సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే సమయానికి జరగాల్సిన పని కాస్తా జరిగిపోయింది. పాఠశాలలో ఉన్న విద్యార్థుల బుక్స్ తో పాటు పాఠశాలకు చెందిన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..