రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఈఘటనపై ఆయన స్పందిస్తూ… ఈనెల 25వతేదీన చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయన్నారు. 34మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా…వారిలో నలుగురు మహిళలు చనిపోయారన్నారు. మిగిలిన 30మందికి మళ్లీ టెస్టులు చేస్తామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశామన్నారు. ఆపరేషన్లు చేసిన వైద్యుల లైసెన్సులు రద్దు చేశామన్నారు. పారదర్శకమైన విచారణకు ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని శ్రీనివాసరావు తెలిపారు.