తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా రద్దీ పెరిగిందని, అప్పుడే తొందరపడి భక్తులు రావొద్దంటున్నారు అధికారులు.
వారాంతంలో వరుసగా వచ్చిన సెలవులతో ఈ రద్దీ నెలకొందని, సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. రాత్రి 8 గంటల వరకు 56,546 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. వరుస సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ యాత్రను వాయిదా వేయాలని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Advertisement
తాజా వార్తలు
Advertisement