Friday, November 22, 2024

విదేశాల్లో దేశీయ ఖ్యాతి.. ఎకనామిస్ట్ గోపీనాథన్ కు అనూహ్య పదోన్నతి..

ప్ర‌భ‌న్యూస్: ఇంటర్నేషనల్‌ మోనిటరీ ఫండ్‌(ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకనామిస్ట్‌ గీతా గోపినాథన్‌కు పెద్ద పదోన్నత లభించింది. ఐఎంఎఫ్‌ తదుపరి డిఫ్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు. తొలి డిఫ్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గియోఫ్రే వొకమోటో స్థానంలో గీత గోపినాథన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 తొలినాళ్లలోనే గియోఫ్రే వొకమోటో బాధ్యతల నుంచి దిగిపోనున్నారు. గీతా గోపినాథన్‌ జనవరిలోనే ఐఎంఎఫ్‌ను వదిలి తిరిగి హార్వర్డ్‌ యూనివర్సిటీ విధుల్లో చేరాల్సి ఉంది. కానీ ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిష్టిలీనా జార్జివా కింద కీలకమైన పాలసీల రూపకల్పనలో అవకాశం దక్కడంతో ఐఎంఎఫ్‌లోనే కొనసాగాలని ఆమె నిర్ణయించారు.

ప్రధాన స్థూల ఆర్థిక వేత్తల్లో ఒకరిగా గీతా గోపినాథన్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని జార్జీవా కొనియాడారు. ఐఎంఎఫ్‌ నంబర్‌ 2 ఉద్యోగంలో కొనసాగేందుకు తగిన అనుభవం అమెకు ఉందన్నారు. కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ఐఎంఎఫ్‌ సభ్య దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె అన్నారు. గీతా గోపినాథన్‌ ప్రత్యేక నైపుణ్యాలు, ఎన్నో ఏళ్ల అనుభవం ఆమెకు అర్హతలని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్‌ నంబర్‌ 2 స్థానానికి గీతా గోపినాథన్‌ సరైన వ్యక్తి అని జార్జీవా చెప్పారు. కాగా ఐఎంఎఫ్‌కు ఎకనామిస్టుగా పనిచేసిన తొలి మహిళగా గీతాగోపినాథన్‌ గుర్తింపు పొందారు. ఐఎంఎఫ్‌ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్లు, దేశాలు కొత్త అనలైటికల్‌ విధానాలను కొనసాగించడం, ఇంటర్నేషనల్‌ క్యాపిటల్‌ ఫ్లోలపై స్పందనల విషయంలో ఆమె కీలకంగా వ్యవహరించారని జార్జివా చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement