యూఏఈ వేదికగా డిసెంబరు 8 నుంచి 17వ తేదీ వరకు అండర్-19 ఆసియా కప్ జరగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఇవ్వాల భారత జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఇద్దరు హైదరాబాదీ కుర్రాళ్లు ఆరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ ఉన్నారు. వీరు ఇటీవల నిర్వహించిన చాలెంజర్ ట్రోఫీ ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. అవనీశ్ రావు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కాగా… మురుగన్ అభిషేక్ ఆల్ రౌండర్. వీరిద్దరూ నవంబరు 3 నుంచి 9 వరకు గువాహటిలో నిర్వహించిన అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో సత్తా చాటారు.
కాగా, 15 మందితో అండర్-19 భారత జట్టును ప్రకటించింది జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ. వీరితో పాటు ముగ్గురిని స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ ముగ్గురు కూడా జట్టుతో పాటే ఉంటారు. వీరితో పాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. అయితే వీరు జట్టుతో పాటు వెళ్లరు.
ఎవరైనా ఆటగాడు గాయపడితే ఈ నలుగురిలోంచి ఎంపిక చేస్తారు. వరల్డ్ కప్ లో పాల్గొనే భారత అండర్-19 జట్టుకు ఉదయ్ సహారన్ (పంజాబ్) కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కాగా, డిసెంబరు 8న ఆసియా కప్ ప్రారంభం కానుండగా… భారత్ తన ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది. డిసెంబర్ 10న పాకిస్థాన్‌తో.. డిసెంబర్ 12న నేపాల్‌తో తలపడుతుంది.
అండర్-19 భారత జట్టు …
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), ఆరవెల్లి అవనీశ్ రావు (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, అర్షిన్ కులకర్ణి, రాజ్ లింబానీ, ఆదర్శ్ సింగ్, ఆరాధ్య శుక్లా, రుద్ర మయూర్ పటేల్, ధనుష్ గౌడ, సచిన్ దాస్, ఇన్నేశ్ మహాజన్ (వికెట్ కీపర్), ప్రియాంశు మోలియా, ముషీర్ ఖాన్.
ట్రావెలింగ్ స్టాండ్ బై ఆటగాళ్లు…
ఎండీ అమన్, ప్రేమ్ దేవకర్, అన్ష్ గోసాయ్
అదనపు రిజర్వ్ ఆటగాళ్లు…
పి.విఘ్నేశ్, కిరణ్ చోర్మలే, దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్