ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మహిళల హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ అజేయంగా సెమీస్ చేరింది. కాగా, బీహార్లోని రాజ్గిరి హాకీ స్టేడియంలో ఈరోజు జరిగిన గ్రూప్ దశలో చివరి మ్యాచ్లో జపాన్ను 3-0తో చిత్తు చేసిన భారత మహిళల జట్టు సెమీస్లోకి దూసుకెళ్లింది.
37వ నిమిషంలో వైస్ కెప్టెన్ నవనీత్ కౌర్ భారత్కు తొలి గోల్ అందించింది. ఆ తర్వాత టోర్నీలో అత్యధిక స్కోరు సాధించిన దీపిక (47వ, 48వ నిమిషాలు) నాలుగో క్వార్టర్లో జట్టుకు రెండో గోల్ అందించింది. దీంతో టీమిండియా 3-0తో గెలిచి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
మంగళవారం జరగనున్న సెమీఫైనల్లో మరోసారి భారత్, జపాన్ జట్లు తలపడనుండగా.. మరో సెమీఫైనల్లో చైనా, మలేషియాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి.