ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, గెలిచామని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కంటే బీజేపీకి సీట్లు తగ్గుతాయని ముందే చెప్పామని, అదే జరిగిందన్నారు. బీజేపీ సీట్లు భవిష్యత్తులో మరిన్ని తగ్గుతాయంటూ విమర్శించారు. యూపీ ఎన్నికల్లో తమ సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని 1.5 రెట్లు పెంచుకున్నామని, దీనిపై ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వివరించారు. బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయని నిరూపించామని, ఇంకా తగ్గుతాయంటూ జోస్యం చెప్పారు. ఈ సీట్ల తగ్గుదల నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నారు.
ఆ పార్టీకి ఉన్న భ్రమలు సగానికి పైగా తొలగిపోయాయని, మరికొన్ని రోజుల్లో పూర్తిగా పోతాయని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అధికారంలో లేనంత మాత్రాన.. యూపీ ప్రజలను పట్టించుకోకుండా ఉండమని, సమస్యలపై అధికార పార్టీని నిలదీస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు పోరాడుతామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..