Friday, November 22, 2024

ఐపీఎల్ లో మోస్ట్ క్లాసిక్ బ్యాట్స్‌మెన్.. కింగ్ కోహ్లీ పేరిట అన్ బ్రేక‌బుల్ రికార్డులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో త‌మ టీమ్ ట్రోఫీ గెలవనప్పటికీ బెంగ‌ళూరు జ‌ట్టు హ్యాపీగానే ఉంది. త‌మ జ‌ట్టులో విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లి ఒకడని డివిలియ‌ర్స్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. నిన్న (ఆదివారం) గుజ‌రాత్ లో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌గా.. “విరాట్ మనకు అవసరమైన ప్ర‌తీసారి టీమ్ కు అండ‌గా నిల‌బ‌డ్డాడు” అని డివిలియర్స్ ట్వీట్ చేశాడు. ఈ సీజ‌న్ లో కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన‌ మెత్తం ఐపీఎల్ మ్యాచ్ ల‌లో కోహ్లి పేరిట ఉన్న 5 అన్ బ్రేక‌బుల్ రికార్డులు ఏంటో చూద్దాం.

ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డులు…

అత్యంత శతకాలు

- Advertisement -

ఐపీఎల్‌లో కోహ్లి నిన్న (ఆదివారం) గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో 61 బంతుల్లో 101* పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో ఏడు సెంచరీలు నమోదు చేసిన ప్లేయ‌ర్ గా రికార్డు శృష్టించాడు.

అత్యధిక పరుగులు

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 16 సీజ‌న్ల ఐపీఎల్ మ్యాచ్ ల‌లో 237 మ్యాచ్ లు ఆడి 7 సెంచరీలు, 50 అర్ధసెంచరీలతో.. 7,263 పరుగులు చేశాడు కింగ్ కోహ్లీ.. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ స్కోరర్ గా నిలిచాడు కోహ్లి.

ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు

ఐపిఎల్ 2016వ సీజ‌న్ లో అత్య‌ధికంగా 973 ప‌రుగులు చేశాడు కోహ్లీ.. ఒకే ఐపిఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆ రికార్డ్ ఇప్పటికీ అన్ బ్రేక‌బుల్ గానే మిగిలిపోయింది.

అత్యధిక భాగస్వామ్య ప‌రుగులు

2016లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో ఎబి డివిలియర్స్, విరాట్ కోహ్లిల భాగ‌స్వామ్యంతో 229 పరుగులు చేశారు. ఆ సీజన్ మెత్తం 4 సెంచ‌రీల‌తో కోహ్లీ 973 పరుగులు చేయ‌గా.. AB డివిలియర్స్ 687 పరుగులు చేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో కోహ్లి 4 సెంచరీలు చేసిన ఘ‌న‌త ఇప్పటివ‌ర‌కు IPL సీజన్‌లో ఏ ఆటగాడికీ అత్యధికం కాలేదు.

చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక పరుగులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ లిస్ట్ లో 2,700 పరుగులతో కోహ్లీ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండ‌గా.. 1,960 పరుగులతో డివిలియర్స్ 2వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement