అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో అదరకొడుతున్నారు. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై గెలిచిన యువ భారత్ సెమీస్‌లోకి ప్రవేశించింది. కాగా, 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో సూపర్ సిక్స్ దశలో చివరి మ్యాచ్ ఆడిన యువ భారత్ 132 పరుగుల తేడాతో నేపాల్ పై విజయం సాధించింది.
భారత్ బౌలర్లలో సౌమీ పాండే అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. అర్షిన్ కులకర్ణి 2 వికెట్లు పడకొట్టగా.. రాజ్ లింబాని, ఆరాధ్య శుక్లా, మురుగన్ అభిషేక్ చరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యటింగ్ చేసిన భారత జట్టు…. నేపాల్‌పై విరుచుకపడింది. బ్లూమ్‌ఫాంటైన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ దాస్ (116), కెప్టెన్ ఉదయ్ సహరన్ (100) శతకాలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.