సూరత్ – లోక్ సభ ఎన్నికలలో బిజెపి బోణి కొట్టింది.. ఇంకా నామినేషన్ లు ప్రక్రియ కొనసాగుతుండగానే గుజరాత్ లోని సూరత్ స్థానాన్నిక ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బిరిలోకి దిగిన నిలేశ్ ఖుంబానీ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.. ఆయన నామినేషన్ పత్రాలపై ప్రతిపాదించిన ముగ్గురు సంతకాలు ఫేక్ అని తేలడంతో ఆయన నామినేషన్ ను తొసిపుచ్చారు. అలాగే ఇక్కడ నుంచి పోటీ దిగిన 8 మంది స్వతంత్రులు నేడు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.. దీంతో బరిలో నిలిచిన బిజెపి అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.. నామినేషన్ ల ప్రక్రియ అనంతరం బిజెపి అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement