హైదరాబాద్, ఆంధ్రప్రభ : తొర్రూరు హెచ్‌ఎండీఏ లేఅవుట్‌కు సంబంధించి శనివారం 50 ప్లాట్లకు ఆన్‌లైన్ ద్వారా వేలం ప్రక్రియ జరిగింది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఆన్‌లైన్ వేలం (ఈ-ఆక్షన్)లో ప్లాట్లు మార్నింగ్ సెషన్‌లో 25 ప్లాట్లు, ఈవినింగ్ సెషన్‌లో 25 ప్లాట్ల చొప్పున వేలం ప్రక్రియను నిర్వహించారు. మార్నింగ్ సెషన్‌లో 25 ప్లాట్లకుగానూ 23 ప్లాట్లకు బిడ్డింగ్ జరిగింది.
అత్యధికంగా గజం రూ.38,500 ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ.20,500 బిడ్డర్లు కోట్ చేశారు. ఈవినింగ్ సెషన్‌లో 25 ప్లాట్లకుగానూ 10 ప్లాట్లకు బిడ్డింగ్ జరిగింది. అత్యధికంగా గజం రూ.28వేల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ.20,500లకు బిడ్డర్లు కోట్ చేశారు. శనివారం జరిగిన వేలం ద్వారా రూ.23.56 కోట్ల విలువజేసే 33 ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. సోమవారం చివరి రోజున మిగిలిన ప్లాట్లకు ఆన్‌లైన్ వేలం జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.