తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.
తెలంగాణ వచ్చిన నాటి నుంచి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1.90 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే… భారీస్థాయిలో ప్రగతి భవన్ దగ్గర పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన నిరుద్యోగులను పోలీసులు గోషా మహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్ నివాసం సమీపంలోని భరతమాత విగ్రహం తొలగింపు.. స్థానికుల ఆగ్రహం