Saturday, November 23, 2024

రష్యా అల్టిమేటం బేఖాతరు, లొంగుబాటుకు ఉక్రెయిన్‌ సైన్యం నిరాకరణ

ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలన్న రష్యా అల్టిమేటాన్ని ఉక్రెయిన్‌ వీరసైనికులు లక్ష్యపెట్టలేదు. దేశం కోసం చావుకైనా సిద్ధమని, తుది వరకూ పోరాడతామని స్పష్టంచేశారు. లొంగిపోయిన సైనికుల ప్రాణాలకు హామీ ఇస్తామన్న శత్రుదేశ ప్రకటనను ఖాతరు చెయ్యలేదు. మాస్కోకాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెడ్‌లైన్‌ విధించింది. ప్రస్తుతం మేరియుపోల్‌లో లక్ష మంది మిగిలి ఉన్నారు. ఈ నగరంలో అత్యధిక ప్రాంతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని నిన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రష్యా అల్టిమేటం విడుదల కావడం గమనార్హం. ఇప్పటికే రష్యా దళాలు ఈ నగరంపై పట్టు సాధించాయి.

చాలా చిన్న ప్రాంతాల్లోనే ఉక్రెయిన్‌ మద్దతుదారులు ఉన్నారని మాస్కో రక్షణశాఖ పేర్కొంది. కాగా ఒడెసాకు చెందిన ఉక్రెయిన్‌ ఎంపీ ఒలెక్సీ గోంచరెంకో మాట్లాడుతూ, చివరి రక్షకులు తుది వరకు పోరాడతారు. నేను నిన్న వారితో మాట్లాడాను. వారు చివరదాకా పోరాడతారని నాకు తెలుసు. మేరియుపోల్‌పై కొనసాగుతున్న మువట్టడి నిజమైన మారణహోమం. ఇప్పటికే ఇక్కడ 20వేల మందికిపైగా చంపబడ్డారు అని ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement