రష్యాపై దాడి విషయంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో రష్యా.. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ప్రకటించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన లెక్కలను ఖండించారు. ఉక్రెయిన్‌లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభించినట్టు వివరించారు. ఉక్రెయిన్‌తో పాటు రష్య ఆర్మీ కూడా ప్రాణాలు కోల్పయిదని, గాయాలపాలైందని తెలిపారు. ఉక్రెయిన్‌తో పోలిస్తే.. తీవ్రత చాలా రెట్లు తక్కువ అని చెప్పుకొచ్చారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌కు సంబంధించిన 27 కమాండ్ పోస్టులు, కమ్యూనికేషన్ కేంద్రాలు, 38 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను ధంసం చేసిందన్నారు. అలాగే 56 రాడార్ స్టేషన్లతో పాటు 1067 ఉక్రెయిన్ సైనికులను హతమార్చిందని రక్షణ మంత్రిత శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ వాదనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ చెబుతున్నంత రష్యన్ ఆర్మీ చనిపోలేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..