Friday, November 22, 2024

యుద్ధంలో లక్షమంది మృతి.. ఉక్రెయిన్‌ రక్షణమంత్రి రెజ్నికోవ్‌ వెల్లడి

రష్యా దండయాత్ర నేపథ్యంలో చెలరేగిన యుద్ధంలో ఉక్రెయిన్‌వైపు ప్రాణనష్టం భారీగానే ఉందని, దాదాపు లక్షమంది వరకు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రక్షణమంత్రి ఒలెక్సి రెజ్నికోవ్‌ చెప్పారు. మరణాలపై ఎక్కువ వివరాలు చెప్పడానికి ఇష్టపడని ఆయన మృతుల సంఖ్య దాదాపు లక్ష ఉండొచ్చని మాత్రం స్పష్టం చేశారు. విదేశీ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. మృతిచెందినవారిలో సైనికులు, సాధారణ పౌరులు, విదేశీయులు కూడా ఉన్నారన్న ఆయన రష్యావైపు సైనికుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధంలో రష్యాకు చెందిన 16వేలమంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా నిఘావిభాగం చెబుతున్న విషయాన్ని ఆయన కొట్టి పారేశారు. కనీసం 35వేలమంది సైనికులు, ఉన్నత సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారని రెజ్నికోవ్‌ చెప్పారు.

ఈనెల 15నాటికి కేవలం 4452మంది ఉక్రేనియన్లు ప్రాణాలు కోల్పోయారని, వారిలో 280మంది చిన్నారులున్నారని ఐరాస మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది. ఒక్క డోనెట్‌స్కీ, లుషాంక్‌లలోనే 2583మంది మరణించినట్లు వెల్లడించింది. అయితే వాస్తవ గణాంకాలు వందల రెట్లున్నాయని రెజ్నికోవ్‌ చెప్పారు. కాగా రష్యాను ఎదుర్కొనేందుకు వీలుగా మరో 1 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని సరఫరా చేసేందుకు అమెరికా అంగీకరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement