Saturday, November 23, 2024

ఉక్రెయిన్ టు తెలంగాణా వయా ఢిల్లీ.. సురక్షితంగా బయటపడ్డ 111 మంది విద్యార్థులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎన్నో ఆశలతో చదువుకోవడానికి దేశం కాని దేశం వెళ్లిన తెలుగు విద్యార్థులు యుద్ధం బారి నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి విడతల వారీగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. బుధవారం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వచ్చిన 30 మంది విద్యార్థులు తెలంగాణా భవన్‌కు చేరుకున్నారు. మరో 8 మంది వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్న విద్యార్థులకు తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో వసతి, భోజన, రవాణా, ఇతర ఏర్పాట్లు చేశారు.

ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3వ తేదీ తెల్లవారుజాము వరకు మొత్తం 111 మంది తెలంగాణా విద్యార్థులు ఢిల్లీ, ముంబై చేరుకున్నారు. విద్యార్థులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మిగతా తెలంగాణా విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement