నల్లసముద్రంలో మోహరించిన రష్యా నౌకలు పలాయనం చిత్తగించాయని ఉక్రెయిన్ వెల్లడించింది. తాము క్షిపణులతోను, డ్రోన్లతోను దాడులు చేస్తామన్న భయంతో ప్రస్తుతం మోహరించిన ప్రాంతం నుంచి న100నాటికల్ మైళ్ల దూరం వెనక్కు వెళ్లిపోయాయని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన తరువాత దాదాపు 300 నౌకలను నల్లసముద్రంలో రష్యా మోహరించింది. ప్రస్తుతం రష్యా వ్యూహం మార్చింది. కాలిబర్ క్రూయిజ్ మిసైల్స్ దాడిని తప్పించుకునేందుకు కాస్త వెనక్కు తగ్గింది. తమ దాడులను ఎదుర్కొనేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, క్రిమియా, ఖేర్సన్ ప్రాంతాల్లో తీరప్రాంత క్షిపణి వ్యవస్థలను మోహరించిందని ఆరోపించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.