Friday, November 22, 2024

ఉక్రెయిన్‌-రష్యా.. భీకర పోరు.. నోవా కఖోవ్కా హస్తగతం, దీటుగా పోరాడిన ఉక్రెయిన్‌ ఆర్మీ..

ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడి కొనసాగుతూనే ఉంది. ఒక వైపు బెలారస్‌లో శాంతి చర్చల ప్రతిపాదన కొనసాగుతుండగా.. మరోవైపు రష్యన్‌ బలగాలు.. ఉక్రెయిన్‌లోని ఒక్కో నగరాన్ని హస్తగతం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. యుద్ధ ట్యాంకులు, మెషిన్‌ గన్స్‌, హెలికాప్టర్లు, క్షిపణులతో రష్యా దాడికి పాల్పడుతూనే ఉంది. రష్యన్‌ ఆర్మీ కన్ను ఇప్పుడు.. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కియోవ్‌పై పడింది. ఈ నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్‌ ఆర్మీ ధీటుగా తిప్పికొడుతున్నది. ఖార్కియెవ్‌లోకి ప్రవేశించి రష్యా జెండాను ఎగురవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నగరం ఐటీ హబ్‌గా ప్రసిద్ధి. ఇక్కడే భారీ పరిశ్రమలున్నాయి. టర్బో ఆటమ్‌, ఎలక్ట్రో ట్యూజ్మాష్‌ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హెవీ పవర్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్మాణంలో 17 శాతం వాటా ఈ కంపెనీలకు ఉంది. 500 కంపెనీలు.. 25వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులున్నారు. ఖార్కియెవ్‌లోకి రష్యా సాయుధ వాహనాలు ప్రవేశించడం.. వాటిని ఉక్రెయిన్‌ ఆర్మీ తిప్పికొట్టడం జరుగుతూనే ఉంది. ఈ నగరం హస్తగతం కోసం ఇరు దేశాల మధ్య భీకర పోరాటం కొనసాగుతున్నది.

నగరంలోకి సాయుధ వాహనాలు..

నగరంలోకి రష్యా సాయుధ వాహనాలు ప్రవేశించినట్టు ఆ నగర రీజినల్‌ గవర్నర్‌ ఓలె సైనిగుబోవ్‌ ఆదివారం ప్రకటించారు. ఖార్కియెవ్‌ నగరంలో సుమారు 14లక్షల మంది జనాభా నివాసం ఉంటారు. రష్యన్‌ సైన్యం నగరంలో ప్రవేశించడంతో.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు. గత రాత్రంతా.. ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని.. రష్యా వైమానిక దాడులు జరుపుతూనే ఉంది. ఈ దాడుల్లో ఓ 9 అంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నగరానికి సమీపంలోని ఓ గ్యాస్‌ పైప్‌లైన్‌ను కూడా రష్యా బలగాలు పేల్చేశాయని ఉక్రెయిన్‌ కమ్యూనికేషన్స్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ గ్యాస్‌ పైప్‌లైన్‌ పేల్చేయడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఉక్రెయిన్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ.. కిటికీలు మూసి ఉంచుకోవాలని సూచించింది.

సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని ఖార్కియెవ్‌ నగరంలోకి ప్రవేశించిన సందర్భంగా జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్‌ సైనికులు ఓ గోడ చాటున ఉండగా.. మరొకరు భుజంపై నుంచి మిసైల్‌ పేల్చుతున్న దృశ్యం ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నది. రష్యాలో విధుల్లో ఉన్న సైనికుల స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై నిషేధం విధించింది. సైనికులు సోషల్‌ మీడియాను ఉపయోగించే తీరు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించొచ్చని భావిస్తూ.. 2019లో ఈ నిషేధం విధించారు. అయితే ఇప్పుడు దాడులు జరుగుతుండగా.. ఉక్రెయిన్‌ సైనికులు షేర్‌ చేస్తున్న ఫొటోలు.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో సూచిస్తున్నాయి.

- Advertisement -

పట్టువదలని ఉక్రెయిన్‌ సైన్యం..

ఆదివారం ఉదయం ఖార్కియెవ్‌ నగరాన్ని హస్త గతం చేసేందుకు రష్యా ప్రయత్నించగా.. మధ్యాహ్న సమయంలో కొంత విఫలమైంది. నగరంలోకి రష్యా సైనికులు కూడా చొచ్చుకొచ్చారు. మధ్యాహ్నం తరువాత పరిస్థితి మారిపోయింది. ఉక్రెయిన్‌ బలగాలు రష్యన్‌ సైనికులను ధీటుగా ఎదుర్కొన్నాయి. దీంతో పుతిన్‌ బలగాలు మళ్లిd వెనక్కి తగ్గాయి. ఉదయం ఖార్కియెవ్‌లో ప్రవేశించిన రష్యన్‌ ఆర్మీని.. మధ్యాహ్నానానికి మళ్లిd తిప్పిపంపింది. ఖార్కియెవ్‌ నగరం మళ్లిd పూర్తిగా ఉక్రెయిన్‌ ఆర్మీ చేతుల్లోకి వచ్చిందని ప్రాంతీ గవర్నర్‌ ప్రకటించారు. ఖార్కియెవ్‌ నగరం మీద పూర్తి నియంత్రణ తమదే అంటూ తెలిపారు. ఉక్రెయిన్‌ సైనికులు, పోలీసులు, రక్షణ శాఖ సిబ్బంది నగరంలో తమ విధుల్లో ఉన్నారని, నగరంలో ప్రత్యర్థి సైనికులు ఎవరూ లేకుండా చూస్తున్నారని వివరించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. ఎవరి నియంత్రణలో నగరం ఉందన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి స్థానికుల సమాచారం ప్రకారం.. మళ్లీ ఉక్రెయిన్‌ అదుపులోనే ఖార్కియెవ్‌ ఉందని తెలుస్తున్నది. వీధుల్లో పోరాటాలు కొంత తగ్గినట్టు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement