Friday, November 22, 2024

ఖార్ఖీవ్‌ని చేజిక్కించుకుంటున్న ఉక్రెయిన్‌.

ఉక్రెయిన్‌ దళాలు తమ భూభాగాలను రష్యా నుంచి తిరిగి చేజిక్కించుకునేందుకు నిర్విరామంగా పోరాడు తున్నాయి.ఖార్ఖీవ్‌ సమీపంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ దళాలు క్షేత్ర స్థాయిలోదూసుకుని వెళ్తున్నట్టు వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేసే మేధావుల సంస్థ తెలియజేసింది.రష్యా ఆక్రమించుకున్న భూభాగానికి 12 కిలో మీటర్ల దూరంలోకి ఉక్రెయిన్‌ దళాలువ్యూహాత్మకంగా చేరుకున్నాయనీ,రష్యా దళాలు ఆక్రమించుకున్న 155చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికన్‌ మేధావుల సంస్థ తెలిపింది. మాస్కో మద్దతు గల కుపియాన్‌స్క్‌ పట్టణం మేయర్‌ విటాలే గన్‌చోవ్‌ గురువారం నాడు విలేఖరులతో మాట్లాడుతూ రష్యన్‌ సేనలు ఆక్రమించిన ప్రాంతాల నుంచి నిర్వాసితులను ఖాళీ చేయిస్తున్నట్టు పేర్కొన్నారు.ఈప్రాంతంలో బాంబుల వర్షం నిరవధికంగా సాగుతోందని ఆయన అన్నారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలినెస్కీ బుధవారంరాత్రి వీడియో ప్రసంగంలో ఖార్ఖీవ్‌ని తిరిగి కైవసం చేసుకున్నామని ప్రకటించారు.ఆయన వివరాలు వెల్లడించలేదు. అయితే, ఖార్ఖీవ్‌ని ఆక్రమించిన రష్యన్‌దళాలు ుఉక్రెయిన్‌దళాల ధాటికి తట్టుకోలేక వెనుదిరుగుతున్నాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement