Saturday, November 23, 2024

EUలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం.. ఉక్రెయిన్‌కు సైన్యం పంపాలని జెలెనె స్కీ వీడియో సందేశం..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు ప్రారంభమైన కొద్ది సేపటికే.. జెలెన్‌ స్కీ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని రష్యా ఆర్మీ వెంటనే ఆయుధాలు కిందికి దించి లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తుండటంతో.. జెలెన్‌ స్కీ కూడా జోరు పెంచినట్టు తెలుస్తున్నది. యూరోపియన్‌ యూనియన్‌ ఎదుట జెలెన్‌ స్కీ ఓ కీలక ప్రతిపాదన ఉంచారు. సోమవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో తమ దేశానికి వెంటనే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో సభ్యతం ఇవాలని జెలెన్‌ స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నా అని, ఇది సాధ్యం అవుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఫైటర్‌ జెట్లను అందించాలని నిర్ణయించినట్టు ఈయూ కూటమి విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ తెలిపారు. దీంతో రష్యాపై దాడులను తీవ్రతరం చేసేందుకు ఉక్రెయిన్‌కు ఊహించని మద్దతు తోడైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement