దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (UGC NET) పరీక్ష షెడ్యూల్‌ను విడుదల అయ్యింది. డిసెంబర్ 6 నుంచి 14 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇక రిజల్ట్స్ ని 2024, జనవరి 10న వెల్లడించనున్నారు.
మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరగనుండగా… పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షకు 10 రోజుల ముందుగా అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి షిఫ్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో కనీసం అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ఎంపిక చేస్తారు.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, , నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్
ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం,అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 011-40759000 ఫోన్ నెంబరుకు సంప్రదించాలి.