Saturday, November 9, 2024

Delhi: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల..

ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు సెక్యూరిటీ పిన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేయాలంటే అర్హత సాధించేందుకు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ ప్రతీ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

గతేడాది డిసెంబర్‌ 6 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 292 నగరాల్లో పరీక్ష జరిగింది. దాదాపు 9,45,918 మంది అభ్యర్థులు యూజీసీ నెట్‌ పరీక్షకు హాజరయ్యారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 10వ తేదీన ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌, చెన్నైలలో పరీక్షను మళ్లీ నిర్వహించడంతో ఫలితాల వెల్లడి వాయిదా పడింది. తాజాగా ఫలితాలు విడుదల కావడంతో విద్యార్ధులు స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. ఫలితాల కోసం ugcnet.nta.ac.in. వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement