యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ – నెట్) ఫలితాలను జాతీయ పరీక్షల మండలి ఫలితాలను ఇవ్వాల (ఏప్రిల్ 13న) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
సీబీటీ విధానంలో మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. యూజీసీ ఆధ్వర్యంలో ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. కాగా, ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ ని అధికారిక వెబ్‌సైట్‌లో https://ntaresults.nic.in/ అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. నెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.