Tuesday, November 26, 2024

ఉగాదికి ధరాఘాతం.. అన్నిరకాల వస్తువుల ధరల పెంపుతో ప్ర‌జ‌ల‌కు కష్టాలు

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌ : రెండేళ్లపాటు ఉపాది పండగకు ఆటంకాలు ఎదురయ్యాయి.. ఈసారి పండగ ఘనంగా జరుపుకుందామని అనుకుంటున్న సమయంలో ధరలు వాయువేగంతో పెరగడం సామాన్యులను ఇబ్బందులపాలు చేస్తోంది…ఈసారి ఉగాది పండగకు కరోనా ఆటంకం లేకపోయినా ధరలు పెద్ద దెబ్బగా మారాయి…అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఉపాది పండగను ఘనంగా జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు. పండగ చేసుకోవడం తప్పదు కనకా చేసుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్‌ ధరలను మొదలుని పెట్రో ధరలు, విద్యుత్తు చార్జీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నూనెతోపాటు పప్పులు, పిండి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి…. శుభకృత్‌నామ సంవత్సరానికి ధరలు స్వాగతం పలుకుతున్నాయి… కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుుతున్నందుకు ఒక వైపు సంతోషం…ధరలు పెరిగినందుకు మరో వైపు దుఖం నెలకొంది. ఉపాది పండగంటేనే పిండి వంటలు గుమగుమలాడాల్సిందే…తెలుగు నామ సంతవ్సరం మొదలు అయ్యే రోజు కావడంతో ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగితే ఏడాదంతా అంతా బాగానే ఉంటుందనే నమ్మకం. కానీ పండగకు ధరల పెంపు ఇబ్బందిగా మారింది. గతసారి కరోనా దెబ్బకు పండగ ఘనంగా జరుపుతున్న పరిస్థితులు లేవు. కేవలం ఇళ్లలోనే పండగ జరుపుకోవల్సిన పరిస్థితులు. ఉపాది రోజు పంతుళ్లు పంచాంగం చదివి వినిపిస్తారు. పేర్లపై బలం ఎలా ఉంది…ఆదాయం ఎంత వ్యయమెంతా అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. కానీ గతసారి కరోనా నేపథ్యంలో పంచాంగపఠనం కూడా నిర్వహించని పరిస్థితులు. ఈసారి ఆ పరిస్థితులు లేవు. అంతా బాగుంటుందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ధరల పెంపు సామాన్య, మధ్యతరగతి వర్గాలను ఇబ్బందులపాలు చేస్తోంది. ఈసారి శుభకృత్‌ నామ సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆశపడ్డ బడుగు జీవులకు ధరల పెంపు కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఉపాదిగి ఉపయోగించే అన్ని రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొనలేని…తినలేని పరిస్థితులు నెలకొన్నాయి….

వేప పువ్వు దొరకని పరిస్థితి..

ఉపాది పచ్చడిలో వేపపువ్వు కీలకం. అది వేస్తేనే అన్ని రకాల రుచులు కలిసినట్లు. కానీ ఈసారి వేప పువ్వు కోసం తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఆరుమాసాల క్రితం వేప చెట్లుకు తెగులు సోకడంతో చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. వేప చెట్లు ఎండిపోయిన దాఖలాలు తక్కువే. కానీ చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. ఉద్యానవన శాఖ అధికారులు రెగులుకు మందులు వేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. ఉపాది పండగ వరకు వేప చెట్లు పూతతో కలకలలాడే పరిస్థితులు నెలకొనేవి. కానీ ఈసారి పరిస్థితులు తలక్రిందులయ్యాయి. గ్రామాల్లో వేప పువ్వుకు ఇబ్బంది ఉండేది కాదు. ఈసారి మొట్టమొదటి సారి వేప పువ్వు కోత ఏర్పడింది. కోత నేపథ్యంలో ఎక్కువ ధరకు విక్రయాలు చేస్తున్నారు. పట్టణాలు…గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వేప పువ్వు కొరత నెలకొంది. ఎక్కువ ధరకైనా కొనుగోలు చేసి ఆరాచారాలను పాటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి…

పూలు, పండ్ల ధరలకు రెక్కలు…

కొత్త సంవత్సర నేపథ్యంలో ఇళ్ల గుమ్మాలకు పూలు, మామిడిఆకులు.. వేప కొమ్మలకో అలంకరించడం ఆనవాయితీ. ఇంటి గుమ్మాలు పచ్చగా కనిపించాలి. ధర ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు. వేసవి తీవ్ర ప్రతాపం చూపిస్తున్న నేపథ్యంలో పూల దిగుబడి చాలావరకు తగ్గింది. దీంతో బెంగుళూరు. మహారాష్ట్ర ప్రాంతాలనుండి బంతిపూలు ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు. కిలో బంతి వంద రూపాయలు పైమాటే…పూల సైజును బట్టి విక్రయాలు చేశారు. రెండురోజుల ముందు కిలో రూ. 50 పలకని బంతి పూలు శుక్రవారం ఒక్కసారిగా ధర పెంచేశారు. మాములు సైజు ఉన్న బంతి కిలో వంద రూపాయలు పలకగా పైజు పెద్దగా ఉన్న బంతిపూలు కిలో ఏకంగా రూ. 150 చొప్పున విక్రయాలు చేశారు. చామంతి ధర రూ. 200 పైమాటే. బంతితోపాటు ఇతర రకాల పూల ధరలు కూడా పెరిగిపోయాయి. పండ్ల ధరలు కూడా రెట్టింపు చేశారు. ఉగాది పచ్చడిలో పండ్లు వినియోగిస్తారు. ధరల పెంపు నేపథ్యంలో కాస్త ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

శుభకృత్‌ నామ సంవత్సరంలో అంతా శుభమే : విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి…

శుభకృత్‌నామ సంవత్సరంలో అందరికీ శుభమే జరగాలి. కరోనా ఆటంకాలు తొలగిపోయినందునా ఈసారి అంతా శుభమే జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని భవవంతున్ని కోరుకుంటున్నా..సంవత్సరమంతా అందరూ శుఖ సంతోషాలకు తులతూగాలని మనసారా కోరుకుంటూ మరోసారి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు….

ఆనందోత్సవాల మధ్య పండగ జరుపుకుందాం : చేవెళ్ల ఎంపీ రంజీత్‌రెడ్డి…

ఈసారి ఉగాది పండగకు ఎలాంటి అడ్డంకులు లేనందునా అందరూ ఆనందోత్సవాల మధ్య ఉగాది పండగ జరుపుకోవాలి…గతసారి కరోనా నేపథ్యంలో ఇబ్బందులుండే. ఈసారి కరోనా మాయమైనందునా ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ ఉగాదిని జరుపుకోవాలి. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వస్తోంది…సీఎం ఆలోచనల వల్లే తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి ఎదిగింది. మన పథకాలను కాఫీ కొట్టి అమలు చేస్తున్న రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి.

కొత్త ఏడాదిలో అంతా మంచే : కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…

కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచే జరగాలి. ప్రజలందరికీ ఉపాది పర్వదిన శుభాకాంక్షలు..ఈ సంవత్సరంలో కరోనా పూర్తిగా మాయం కావాలని అందరం భగవంతున్ని వేడుకుందాం. శుభకృత్‌ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నా…శుభకృత్‌ అంటేనే అందరికీ శుభాలు కలిగించేది. గతసారి ఎదుర్కొన్న కష్టాలు ఈసారి పూర్తిగా దూరం కానున్నాయి. ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు…..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement