మహారాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రేపు బలనిరూపణ పరీక్ష ఉంటుంది. బల పరీక్ష కోసం గవర్నర్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. రేపు సాయంత్రం 5గంటల లోపు బల నిరూపణ పరీక్ష నిర్వహించాలన్నారు. బల పరీక్ష ను రికార్డు చేయాలని గవర్నర్ ఆదేశించారు. 39మంది శివసేన ఎమ్మెల్యేలతో షిండే వేరుకుంపటి పెట్టిన విషయం తెలిసందే. దీంతో మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలో పడింది. బలనిరూపణ పరీక్షకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. దీంతో రేపు ఉద్దవ్ ఠాక్రే సర్కూర్ బల నిరూపణను ఎదుర్కోనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement