Saturday, November 23, 2024

Breaking: మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్​ రాజీనామా.. చివరిసారి కేబినెట్​ భేటీ నిర్ణయాలు వెల్లడి

మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాకరే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవ్వాల రాత్రి జరిగిన ఫేస్​ బుక్​ లైవ్​ ద్వారా మహారాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఉద్ధవ్​. బలపరీక్షకు ముందే ఉద్ధవ్​ రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రేపు జరిగే బలపరీక్షకు వెళ్లి భంగపాటుకు గురయ్యే బదులు.. దానికి ముందే హుందాగా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. నమ్మిన వ్యక్తులే తనను మోసం చేశారని, శివసేన ఎప్పుడు, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఉద్ధవ్​ థాకరే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్​సీపీ  అధినేత శరద్​ పవార్​కు, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

మహారాష్ట్ర కేబినెట్ ఇవ్వాల (బుధవారం) సాయంత్రం సీఎం ఉద్ధవ్​ థాకరే ఆధ్వర్యంలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రి వర్గం. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధరాశివ్‌గా మారుస్తూ మంత్రి వర్గం ఆమోదించింది. అలాగే నవీ ముంబై విమానాశ్రయం పేరును కూడా డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తున్నట్టు కేబినెట్​ ప్రకటించింది.. అయితే ఇవే అంశాలను మహారాష్ట్ర ప్రజలకు ఫేస్​ బుక్​ లైవ్​ ద్వారా సీఎం ఉద్ధవ్​ థాకరే చెప్పే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్​ థాకరేను తొలగించలేదని, శివసేన పార్టీ నమ్మినవారే మోసం చేశారని ఆవేదనగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement