మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయి, ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను పరామర్శించడానికి వెళ్లిన శివసేన అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రెకు జైల్లో చుక్కెదురయింది. ఎంపీ సంజయ్ రౌత్‌తో జైలర్ రూములో భేటీ అయ్యేందుకు మాజీ సీఎం థాక్రే జైలు అధికారులను అనుమతి కోరగా, వారు తిరస్కరించారు. రౌత్‌ను కలవడానికి ధాక్రే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని, కానీ, జైలర్ రూములో భేటీ కావడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ, అవకాశం లేదని స్పష్టం చేశారు.
సాధారణ ఖైదీలను కలిసినట్లుగానే, మాజీ సీఎం థాక్రే, ఎంపీ సంజయ్ రౌత్‌ను కలవాలని స్పష్టం చేశారు. మాజీ సీఎం నుంచి రాతపూర్వక అప్లికేషన్ అందలేదని జైలు అధికారులు తెలిపారు. ఉద్ధవ్‌కు సన్నిహితుడైన శివసేన నేత జైలు అధికారుల ను కలిసి ఉద్ధవ్ థాక్రే 15 నిమిషాలు సంజయ్ రౌత్‌తో మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని కోరగా, అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. కోర్టు అనుమతి తప్పనిసరని వారు స్పష్టం చేశారు.