Wednesday, November 20, 2024

20 ఏళ్లుగా చెట్టుపైనే జీవిస్తున్న ప్రకృతి ప్రేమికుడు

మొక్కలు నాటడం గొప్పకాదు. వాటిని కాపాడుకోవడం గొప్ప. ఇదే సూత్రాన్ని పాటిస్తూ.. చిన్న కొమ్మ కూడా విరగకుండా మామిడి చెట్టుపై భవనం కట్టేశాడు ఓ ప్రకృతి ప్రేమికుడు.

రాజస్థాన్‌‌లోని ఉదయపూర్‌ లో ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని 20 ఏళ్ల క్రితం నిర్మించాడు కేపీ సింగ్ అనే ఇంజినీర్. ఇన్నేళ్లయినా.. ఇల్లు, చెట్టు రెండూ సురక్షితంగా ఉన్నాయి. ఉదయపూర్ కు వచ్చే పర్యాటకులు ఈ ఇంటిని చూడకుండా వెళ్లరు. ఈ ట్రీ హౌస్ నిర్మాణం స‌మ‌యంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. అయినా చిన్న కొమ్మను కూడా కత్తిరించడకుండా నిర్మించానని వీకే సింగ్ చెబుతున్నాడు. ఈ ఇంటిని చెట్టు కొమ్మల ఆధారంగా నిర్మించాడు. రూములన్నీ కొమ్మల వంపులను బట్టి రూపొందించాడు. ప్రతి గదిలో ఎక్కడో ఓచోట మామిడిచెట్టు కొమ్మ కనిపిస్తుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement