Monday, November 25, 2024

TamilNadu: సంచల‌న వాఖ్య‌లు చేసిన ఉద‌య‌నిధి…ప్రాణ ప్రతిష్టకు శంకరాచార్యులు అందుకే రాలేదు..

తమిళనాడు క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శంక‌రాచార్యులు రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు ఎందుకు వెళ్ల‌లేదో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి
ఆయన చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్లే శంకరాచార్యులు రాలేదని ఆరోపించారు.

సనాతన ధర్మంలో ఉన్న అసమానతల గురించి మాట్లాడాను.. అయితే, అసమానతలు ఉన్నాయనడానికి పీఠాధిపతుల చర్యే నిదర్శనం.. ఈ విషయాన్ని నాలుగు నెలల క్రితమే నేను చెప్పా.. కానీ, అందరు నన్ను విమర్శించారనే విషయాన్ని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేసుకున్నాడు.

అయితే, సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను అని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. వితంతువు కావడం, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. డీఎంకే ఏ మతానికి, రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదు.. కానీ, దేశ రాష్ట్రపతిని కూడా దీనికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు.

- Advertisement -

కాగా.. 2023 సెప్టెంబర్ లో అభ్యుదయ రచయితల సదస్సులో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ లాంటిది, సమానత్వం, సామాజిక న్యాయం అభివృద్ధి చెందాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై పలు చోట్లు కేసులు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. న్యాయస్థానాలపై తనకు తగిన గౌరవం ఉంది.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement