కరోనా నేపథ్యంలో భారతీయ ప్రయాణికులపై యుఎఇ ప్రభుత్వం ఆంక్షలు ఇంకా కొనసాగిస్తోంది. భారత్‌లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్ భయంతో పలుదేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సోమవారం నిర్ణయం తీసుకుంది. భారత విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యుఎఇ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ అధికారులు తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆగస్టు 2 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది
ఇది కూడా చదవండి : కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ బదిలీ.. అందుకేనా..?