Friday, November 22, 2024

లైగర్ కి UA సర్టిఫికేట్.. విజయ్ నటనకు సెన్సార్ సభ్యులు ఫిధా!

ఎమర్జింగ్ పాన్-ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో తెర‌కెక్కిన మూవీ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. విజయ్ దేవరకొండ అభిమానులకు శుభవార్తగా.. ‘లైగర్’ మూవీ సెన్సార్ ప‌నులు అయిపోకొట్టిన‌ అధికారులు UA సర్టిఫికేట్‌ను అందించారు. దీంతో సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు, మొదటి సగం 1 గంట 15 నిమిషాలు మరియు రెండవ సగం 1 గంట 5 నిమిషాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఏడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నాయని ప్రొడక్షన్ హౌస్ వర్గాలు తెలిపాయి.

విజయ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన యాక్షన్, డ్యాన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ షార్ట్ రన్‌టైమ్, యాక్షన్ పార్ట్, హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, రమ్యకృష్ణ క్యారెక్టర్, మదర్ సెంటిమెంట్, విజయ్ దేవరకొండ – అనన్య పాండే లవ్ ట్రాక్ ఈ సినిమాలో బాగా పనిచేశాయని భావించినట్లు వర్గాలు తెలిపాయి.ఇక ఈ సినిమా ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement