U19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2024కి సంబంధించిన రీ-షెడ్యూల్ను ప్రకటించింది ICC. టోర్నమెంట్ 15వ ఎడిషన్, వాస్తవానికి శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే, నవంబర్ నెలలో కొన్ని కారణాలతో శ్రీలంక బోర్డును సస్పెండ్ చేసింది ICC. దీంతో టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు మార్చాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు.. దక్షిణాఫ్రికాలో U19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ కొత్త ఏడాది ప్రారంభం (జనవరి 19) నుంచి.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్నట్టు ప్రకటించింది ICC.
టోర్నమెంట్ ద్వారా 41 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న ఐదు వేదికలు ఐసిసి ధృవీకరించింది. ఈ క్రమంలో బ్లూమ్ఫోంటైన్లోని మాంగాంగ్ ఓవల్, ఈస్ట్ లండన్లోని బఫెలో పార్క్, కింబర్లీలోని కింబర్లీ ఓవల్, పొట్చెఫ్స్ట్రూమ్లోని జెబి మార్క్స్ ఓవల్ & బెనోనిలోని విల్లోమూర్ పార్క్ స్టేడియం వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి.
గ్రూప్ లిస్టింగ్..
గ్రూప్ Aలో భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్ & USA ఉన్నాయి.
గ్రూప్ Bలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ & స్కాట్లాండ్..
గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే & నమీబియా ఉండగా,
గ్రూప్ డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు నేపాల్ ఉన్నాయి.