ట్విట్టర్‌లో తెలిపిన పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉన్న హుస్సేన్‌సాగర్ మీద ప్రభుత్వం ఏకంగా బ్రిడ్జిని నిర్మించనుంది. అయితే ఇది సాగర్‌లోకి వెళ్లేందుకు కాదని, పీవీఎన్‌ఆర్ మార్గ్‌గా పిలుస్తున్న నెక్లెస్ రోడ్డు మీద నిర్మించనున్న ఈ వంతెన యూ ఆకారంలో ఉండి కొంత వరకు సాగర్‌పైకి వెళ్ల నుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్ లో శుక్రవారం వెల్లడించారు. ఈ సంవత్సరాంతానికి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. రష్యా రాజధాని మాస్కో పట్టణంలో ఉన్న ఒక వంతెనను ఈ బ్రిడ్జి పోలి ఉంటుందని పేర్కొన్న ఆయన ఆ చిత్రాన్ని పోస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..