Sunday, November 24, 2024

ఆజంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష

మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీపార్టీ నేత ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాలకు మొరాదాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.. కోర్టు జడ్జి స్మితా గోస్వామి ఎస్పీ నేతలకు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున జరిమానా విధించారు.2008వసంవత్సరంలో జాతీరహదారిపై నిరసన చేపట్టడంతో మొరాదాబాద్‌లోని ఛజ్లయిత్ పోలీస్ స్టేషన్‌లో ఆజం ఖాన్, యూపీలోని సువార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్లా ఆజం, మరో ఏడుగురిపై కేసు నమోదైంది.. ఉత్తరప్రదేశ్‌లోని కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో తాజాగా రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement