గురువారం తెల్లారుజామున రెండేళ్ల బాలుడు ప్రమదావశాత్తు బోరుబావిలో పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో చోటుచేుకుంది. ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు మొదలు పెట్టారు.
బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు. బాలుడుకిని కాపాడేందుకు గత కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు. విజయపుర జిల్లాలోని లచయానా గ్రామానికి సతీశ్ ముజగొండ తన 4 ఎకరాల పొలంలో బోరుబావిను తవ్వంచాడు.
అయితే, బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు సాత్విక్. పడిపోయిన అబ్బాయి దాదాపు 16 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా బాలుడికి మొదటగా పైపుల ద్వారా ఆక్సిజన్ ను అందిస్తున్నట్లు వివరించారు. అయితే., బాలుడి కదలికలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక హెల్త్ ఆఫీసర్ డా. అర్చన నేతృత్వంలో వైద్యుల బృందం సిద్ధంగా ఉంది.ఇక గ్రామంలోని సిద్ధలింగ మహారాజు సన్నిధిలో సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేస్తున్నారు. చుడాలిమరి బాబును ఎంత త్వరగా బయటికి తీసుకొస్తారో అధికారులు.