Wednesday, November 20, 2024

రాజస్థాన్‌లో రెండు వారాల లాక్‌డౌన్‌..

దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి మరో రాష్ట్రం లాక్ డౌన్ బాట పట్టింది. ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్‌ సైతం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 24 ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

ఇక అన్ని మతపరమైన ప్రదేశలు మూసివేస్తున్నట్లు తెలిపింది. వివాహ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి ఇవ్వరని, రాష్ట్ర, అంతర్రాష్ట్రల మధ్య ట్రాన్స్‌పోర్టులు కొనసాగుతాయని చెప్పింది. ఇంట్లో రిజిష్టర్‌ మ్యారేజ్‌లు 11 మందికి మించకుండా పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌కు వచ్చే ఏ వ్యక్తయినా 72 గంటలకు మించకుండా ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ చూపాల్సిందేనని స్పష్టం చేసింది. వసల కార్మికులు సొంత ప్రాంతాలకు తిరిగి రాకుండా నిరోధించేందుకు అన్ని పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement