దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు రాష్ట్రాలు చివరి అస్త్రంగా లాక్‌డౌన్‌ను ప్రమోగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో రాష్ట్రం కూడా చేరింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్ డౌన్ విధించగా.. ఒడిశా కూడా ఆ బాటలోనే పయనించింది. ఒడిశాలో గత కొద్ది రోజులుగా నిత్యం 5వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వ్యవధిలో 10వేలకు పైగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 5 నుంచి 19 వరకు తేదీ వరకు 14 రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.
ఎలాంటి అత్యవసర కారణాలను చూపించకుండా రోడ్డెక్కిన వాహనాలను స్వాధీనం చేసుకుంటామని, వారి లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతినిచ్చారు. అయితే దానికి ఓ షరతు పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే ఏది కావాలన్నా కొనుగోలు చేయాలని సూచించింది.. ప్రస్తుతం దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో చైన్‌ను బ్రేక్ చేయడం కోసం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుకోవాల్సి వచ్చిందని ఒడిశా సీఎం వెల్లడించారు. కాగా, కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి.