Friday, November 22, 2024

రెండు టన్నుల ఎర్రచందనం స్వాధీనం -ఆరుగురు అరెస్ట్

కడప క్రైమ్ (ప్రభ న్యూస్) : జిల్లా ఒంటిమిట్ట పరిధిలోని మడపంపల్లి పంచాయతీలో రెండు టన్నుల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు, జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.. ఫ్యాక్షన్ జోన్ డిఎస్పి చెంచు బాబు సూచనల మేరకు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో లో ఒంటిమిట్ట ఇన్స్పెక్టర్ రాజ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి మంటపం పల్లి పంచాయతీలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అతి వేగంగా వచ్చిన కారు.. పోలీసులు చూసి పారిపోతుండగా కారును పట్టుకొని అందులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.. అందులో ఉన్నటువంటి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని విచారించినట్లు తెలిపారు.వారిని విచారించగా 95 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, వీరి వద్ద నుంచి ఒక కారును, వంద ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, అరెస్టయిన వారిలో కడప రియల్ ఎస్టేట్ వ్యాపారి మంచాన రాజశేఖర్, చింతకొమ్మదిన్నె మండలంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్, తిరుపతి జిల్లా రేణిగుంట మండలం చెందిన సోమసుల ప్రసాద్, నగిరి మండలం మల్లారెడ్డి కంట్రీకి చెందిన ఫారెస్ట్ నర్సరీ వాచ్మెన్ రమేష్ , దేవుని కడప హసీనా మ్యాచింగ్ సెంటర్ లో పని చేస్తున్నటువంటి రవికుమార్ , కడప చిన్న చౌక్ జడల మారమ్మ వీధికి చెందిన చీరాల నరసింహులు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement